Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 7:48 pm Posted by : ramakrishna

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగాలి

 

. . . బోధన్ డివిజన్ అధికారులతో  సిపీ సాయి చైతన్య

 బోధన్, బతుకమ్మ :

మొదటి విడతగా ఈ నెల 11 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల లొ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాటు చేయాలని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో బోధన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం పోలిస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా బోధన్ డివిజన్ పరిధిలో గల సమస్యాత్మకమైన మరియు అతి సమస్యత్మక మైనటువంటి పోలింగ్ స్టేషన్ గురించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు.  ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి వీలు లేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు. ఈ  సమీక్షలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ, నిజామాబాద్ నార్త్  సర్కిల్ ఇన్స్పెక్టర్  బి . శ్రీనివాస్,రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ,  రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై   సునీల్, వర్ని ఎస్సై ఎస్.రాజు, రుద్రూర్ ఎస్సై సాయన్న తదితరులు  పాల్గోన్నారు.

The first phase of Panchayat elections should be held in a peaceful atmosphere