ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది
హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఆదివారం ’తెలంగాణ ప్రజా వంచన దినం‘ నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవానికి వ్యతిరేకంగా ‘తెలంగాణ ప్రజా వంచన దినం’ నిర్వహించామని పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని...