కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, విష్ణుపూరి–బాబ్లి ప్రాజెక్టుల గేట్ల నుండి వరద నీరు వదిలేయడంతో గోదావరి ప్రవాహం ఉధృతమైంది. గోదావరి, హరిద్ర, మంజీరా సంగమించే ఈ పవిత్రక్షేత్రం వద్ద నిండుకుండల గోదారమ్మ గర్జనతో ఉప్పొంగిపోతోంది. శివాలయం నీట మునిగింది.. సంగమం ఒడ్డున శతాబ్దాలనాటి పురాతన శివాలయం వరద ముంపుకు గురైంది. నది ఒడ్డున పెనువేగంతో తాకిన అలలు ఆలయాన్ని ముంచెత్తాయి. ఈ దృశ్యం చూసిన భక్తుల హృదయాలను...