Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 10:01 pm Posted by : ramakrishna

పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : “ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాదు నగరంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన మంగళవారం ఫుట్ వాకింగ్ (పేట్రోలింగ్) చేశారు. నగరంలోని ముఖ్య గణేష్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తా ల వద్ద ఆయన పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.

The festival should be celebrated peacefully.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని టౌన్ 1 నుండి నెహ్రూ పార్క్ , పెద్ద పోస్ట్ ఆఫీస్, లక్ష్మీ మెడికల్, పెద్ద బజార్, ఆర్. ఆర్ చౌరస్తా,  వినాయకుల బావి, వీక్లీ మార్కెట్, పోచమ్మ గల్లి రవితేజ గణేష్ మండపం ప్రాంతాలలో పర్యటించారు. ఆయన వెంట  ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు ఉన్నారు.

The festival should be celebrated peacefully.