Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 7:25 pm Posted by : ramakrishna

హోలీ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హోలీ పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ పండుగ ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. బుధవారం నగరంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొని ప్రజలతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

 

The festival of Holi is a symbol of our culture and traditions.

 

తదుపరి 34వ డివిజన్‌లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.

 

The festival of Holi is a symbol of our culture and traditions.

 

అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

 

The festival of Holi is a symbol of our culture and traditions.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగుల్లా మన జీవితాలు కూడా ఆనందంతో, ఐక్యతతో నిండిపోవాలని అన్నారు. నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాధారులని, వారి కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర బంధాలను బలపరుస్తాయని, సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.