. ఇంటర్మీడియెట్ పాస్ అయిన తండ్రీకొడుకులు
వెబ్ న్యూస్, బతుకమ్మ: కొడుకుతోపాటు ఇంటర్ పరీక్షలు రాసిన తండ్రి తన కొడుకుకన్నా ఎక్కువ మార్కులు సాధించి అందరినీ ఆశ్యర్చపరిచాడు. పంజాబ్ రాష్ట్రంలోని బర్నాల కు చెందిన అవతార్ సింగ్ పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ మధ్యలో ఆపేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. ఆయన కుమారుడు ఇటీవల ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా తనకూ చదువుకోవాలనే కోరిక కలిగి పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. కొడుకుతో కలిసి ఇంటర్ పరీక్షలు రాశాడు. అవతార్ సింగ్ కు 72శాతం మార్కులురాగా, కొడుక్కి మాత్రం 69శాతం మార్కులు వచ్చాయి. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు తండ్రీకొడుకులిద్దరూ అడ్మిషన్ తీసుకున్నారు.