రోడ్డెక్కిన రైతన్న

కోటగిరి, బతుకమ్మ :  యాసంగి బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. క్వింటాల్ కు రూ. 500 బోనస్ వస్తుందన్న ఆశతో గత యాసంగి సీజలో పండించిన సన్నాలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ వేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు ఇవ్వకుండా ఖరీఫ్ సీజన్ కోసం...