Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2025, 6:16 pm Posted by : ramakrishna

రైతన్నకు కన్నీరే మిగిలింది

మోర్తాడ్,బతుకమ్మ: ఆరు కాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందు కనిపించడంతో సంతోషంతో ఉన్న రైతు కళ్ళల్లో కన్నీరే మిగిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటను బస్తాల్లో నింపి సిద్ధం చేసిన రైతన్న ఎన్నో ఆశలతో ఉంటుండగా బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ఆశలన్నీ తడిసి ముద్దయి రైతన్న నిరాశలో కృంగిపోతున్నారు. అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు గోడు వెళ్ళ బుచ్చారు. బాల్కొండ నియోజకవర్గములోని పలు గ్రామాల్లో వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.దీంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

The farmer was left with only tears.