Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 1:24 pm Posted by : ramakrishna

రైతు విషం తాగుతున్నా.. ఫోన్ లో లీనమైన తహసీల్దార్

మహబూబ్ నగర్, బతుకమ్మ : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. తన భూమిని  వేరొకరు ఆక్రమించారని ఆరోపిస్తూ ఆయన తహసీల్దార్ కార్యాలయానికి  వెళ్లారు.   భూ సమస్య పరిష్కరం కాకపోవడంతో విసుగెత్తి రైతు ఈఅఘాయిత్యానికి  పాల్పడ్డారు .  రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించినా, తహసీల్దార్ పులి రాజు తాపీగా ఫోన్ చూస్తూ కూర్చున్నారు. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.