ఇందూరు తిరుమలలో కన్నులపండువగా “శ్రీ గోదా రంగనాథ” కళ్యాణం

. . .పాల్గొన్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :    నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో “శ్రీ గోదా రంగనాథ” కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి కళ్యాణ వేడుకల్లో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. బుధవారం      గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో “శ్రీ వ్రతం” చేసి రంగానాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు....