Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 6:00 pm Posted by : ramakrishna

ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ… ఎవరి అంచనాలు వారివే..

 

. . . ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న మున్సిపల్ అభ్యర్థులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ముగియటంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో మాత్రం ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా బాన్సువాడ మున్సిపల్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండగా మెజార్టీ వార్డుల్లో త్రిముఖ పార్టీల పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎవరి ఓట్లు ఎవరు చిలుస్తారు..? త్రిముఖ పోటీలో ఏ పార్టీకి మేలు, ఏ పార్టీకి నష్టం అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్రిముఖ పోరులో భాగంగా కొన్ని వార్డుల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. చీలి పోయీ ఎవరికి నష్టం, లాభం…ఎవరికి నష్టం అనే దానిపై కొంత మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నాలుగైదు వార్డుల్లో ఇండి పెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు 19 వార్డుల్లో పోటీ పడుతుండగా, బీజేపీ 17 వార్డులు, ఎంఐఎం 1 వార్డుల్లో పోటీ చేసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమకు వచ్చే సీట్ల సంఖ్యపై ఆరా తీశాయి. చైర్పర్సన్ క్యాండిడేట్లకు మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అంశంపై చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.