ప్రైవేట్ ఇంటర్ కాలేజీల దుర్మార్గాలను అరికట్టాలి : టిజీవీపీ
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ప్రైవేట్ ఇంటర్ కాలేజీల దుర్మార్గాలను అరికట్టాలని టిజీవీపీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే కొన్ని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించి, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థులు విశ్రాంతి కోల్పోయి, ఒత్తిడితో చదువుపై మనస్సు నిలుపలేని స్థితికి చేరుతున్నారని అన్నారు. ఇంతటితో...