ఆగని మొరం దందా..
అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు ట్రాక్టర్లలో మొరం అక్రమ రవాణా చందూర్, బతుకమ్మ: కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో మొరం దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు. చందూర్ మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులో గల గుట్ట ప్రాంతంలో కొందరు అక్రమార్కులు శనివారం రోజున ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం త్రవ్వకాలు...