చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి
ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర ఆవిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించి గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టి ఋణభారంతో బ్రతుకులీడుస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని జాతీయ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్. యు. జె. (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్...