సింగరేణి ‘జాగృతి’ ఆవిర్భావం

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి సింగరేణి విభాగాన్ని సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత సింగరేణి కార్మికులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని, సింగరేణిలోని 11 ఏరియాలకు ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో...