Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 5:17 pm Posted by : ramakrishna

ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి

బతుకమ్మ, ఆర్మూర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ మాదరి నరేష్ అన్నారు. మంగళవారం ఆర్మూర్ పట్టణంలో డి హెచ్ పి ఎస్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంత పాలనకూ వ్యతిరేకంగా తెలంగాణా ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కీ ఓట్లు వేసి గెలిపించుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా హైడ్రా అంటూ అమాయకపు ప్రజలను రోడ్డు పాలు చేయడం ఎంతవరకు న్యాయమని  అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో పాలనా గాడితప్పిందని తక్షణమే ప్రజలకు డబులు బెడ్ రూమ్, వంట గ్యాస్ సబ్సిడీ, గృహ లక్ష్మి, ఆడపిల్ల వివాహానికి తులం బంగారం, కొత్త రేషన్ కార్డు, డిజిటల్ కార్డు అంటూ ఇతరత్ర ఆరు గ్యారంటీ లు ఇప్పటి అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన  వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో బుజ్జి, మంగ, అరవింద్, రాముతదితరులు పాల్గొన్నారు.