Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2024, 3:58 pm Posted by : ramakrishna

తిరుమల లడ్డును అపవిత్రం చేసిన ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం

నిజమాబాద్ సిటీ, బతుకమ్మ :

నగరం లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ పి మాజీ మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్  మాజీ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు ఎంతో భక్తిగా కొలిచే తిరుమల శ్రీవారి లడ్డును పంది కొవ్వు జంతువుల నెయ్యి, జంతు బొక్కల నూనె నుండి మహాప్రసాదన్ని తయారు చేసి అపవిత్రం చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, కల్తికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించాలన్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాస్త టూరిస్ట్ ప్లేస్ గా మార్చి అందిన కాడికి దోచుకొని చివరికి లడ్డును కూడా కల్తి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలను ప్రతి దాంట్లో ధరలు పెంచి అన్య మతస్తులకు అధికారాన్ని అప్పగించడాన్ని తప్పు పట్టారు. అన్య మతస్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంచరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబిక సత్యనారాయణ, బ్రహ్మానంద చారి,  బోబ్బ నరసింహ రావు, శ్రీనివాసరావు, శంకర్ ముదిరాజ్, లవంగ రాజు, కోటి, నాగేశ్వర్ రావు, సాయిబాబు, మల్లేష్ గౌడ్, స్వామి, ఇప్పలపల్లి విష్ణు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

The effigy of former AP CM Jagan who desecrated the Tirumala Laddu was burnt