- పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగాన్ని బలోపేతం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు హెచ్చరించారు. పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశలు నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, పొడపంగి నాగరాజు మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా పాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల కు ముందు విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముగాస్తుందన్నారు. ఈ విద్యాసంస్థల్లో లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయకపోవడం వలన విద్య పేద,బడుగు, బలహీన వర్గాలకు భారంగా మారింది. అనుమతి లేకుండా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టు విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించిన హామీని తుంగలో తొక్కిందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదు విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా తన యొక్క నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. విద్యార్థులకు రావలసిన ఉపకార వేతనాలు సుమారు 8000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్స్, కాస్మోటిక్ చార్జెస్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ తీసుకోవడం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్య విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తాం .మీ యొక్క ప్రజాప్రతినిధులను గ్రామాలలో అడ్డుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యూ జాతీయ నాయకులు పి మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోవనగిరి మధు, జన్నారపు రాజేశ్వర్ ,డి.శ్రీకాంత్ ,వి సంతోష్. రాష్ట్ర సహాయ కార్యదర్శిలు గౌతమ్ కుమార్, జి.మస్తాన్, జె తిరుపతి ,జి అజయ్ ,డి ప్రణయ్ ,కే శ్రీనివాస్ ,కోశాధికారి రాణా ప్రతాప్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రిన్స్ ,ఎం నాగరాజు, తీగల శ్యామ్, ఝాన్సీ, దీపాలక్ష్మి ,గణేష్ ,సందీప్, వెంకటేష్, రాజేష్ ,మహేష్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.