ఆర్ యూబీ కిందకు బస్సును నడిపిన డ్రైవర్ సస్పెన్షన్
బతుకమ్మ, నిజామాబాద్ ఈ నెల 19న నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు బస్సు నడిపిన డ్రైవర్ ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. రాఖీ పండుగ నాడు నిజామాబాద్ నగరంలో 8 సెం.మీ. వర్షం కురిసింది. దానితో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ జాం కావడంతో మూడున్నర అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించకుండానే హైదరాబాద్ నుంచి 90 మంది ప్రయాణికులతో నిజామాబాద్ బస్టాండ్...