బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డుల డ్రామా
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల బాకీ కార్డుల పేరుతో గ్రామాలలో తప్పుడు విధానాలకు తెరతీసారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో ఎన్నో వాగ్దానాలు చేసి మరిచిపోవడం జరిగిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి,దళిత బంధు విద్యార్థుల ఫీజు,రియంబర్స్మెంట్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేయడం మోసపూరిత వాగ్దానాలన్నారు....