జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలి
అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువు కోసం జిల్లా కు సంబంధించిన పేద, మధ్యతరగతి విద్యార్థులు నగరాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్...