Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 2:08 pm Posted by : ramakrishna

జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలి

అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువు కోసం జిల్లా కు సంబంధించిన పేద, మధ్యతరగతి విద్యార్థులు నగరాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.  ఈ కార్యక్రమంలో విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్, కంఠేశ్వర్ జోనల్ ఇన్ చార్జి దుర్గా దాస్, ఇంద్రసేన, వేణు, శశి వర్ధన్, అభినవ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.