Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 6:56 pm Posted by : ramakrishna

లోక్ అదాలత్ లో సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో జిల్లాకు 5వ స్థానం

  •  ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ వెల్లడి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  సైబర్ క్రైమ్ కేసులను “జాతీయ లోక్ అధాలత్” ద్వారా సత్వర పరిష్కారంలో  రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానంలో నిలిచిందని ఇంచార్జి పోలీస్ కమిషనర్ సింధూశర్మ అన్నారు.  నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు గత కొంత కాలంగా పరిష్కారం కాకుండా కోర్టులలో , బ్యాంక్ లలో అపరిస్కృతంగా ఉన్నాయని, ఇలాంటి 174 కేసులలో మొత్తం రూ.71,52,505-00 లను ఇప్పించడానికి  నిర్వహించిన  జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యాయన్నారు. వివిధ బ్యాంక్ లలో హోల్డ్ అయి ఉన్న డబ్బులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారులకు వారి డబ్బులను ఇప్పించడానికి ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారూ. 25వేల కన్నా ఎక్కువ నష్టపోయిన 131 కేసులలో రూ.67,00221, 25 వేల కన్నా తక్కువ నష్టపోయిన 43 కేసులలో రూ.4,52,284, కోర్టులో ఫైల్ చేసిన మొత్తం 174 కేసులలో 71,52,505 రూపాయలు ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదు దారులకు పోలీసుల యొక్క కృషి వలన వివిధ బ్యాంకులలో హోల్డ్ అయిన బాధితుల డబ్బులను ఇప్పించడం కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా తగు చర్యలు తీసుకుని జాతీయ లోక్ అదాలత్  ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలలో మోసపోయిన బాధితులకు పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాకు సైబర్ క్రైమ్ కేసులలో సత్వర పరిష్కారం చేయడం వలన ఐదవ స్థానం వచ్చిందన్నారు.