Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 1:19 am Posted by : ramakrishna

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారిని

బతుకమ్మ, మోపాల్ – నిజామాబాద్ రూరల్ మండల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ సిబ్బంది సమయం పాలన పాటిస్తూ రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించారు. విధుల్లో ఉన్న ఎం.ఎల్.హెచ్.పి అఖిల్ కి అంటువ్యాధుల నియంత్రణజాతియ ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు.

పి హెచ్ సి ని,పి హెచ్ సి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని, స్వచ్ఛ దనం పచ్చదనం లో భాగంగా ఆరోగ్య కేంద్ర పరిధిలో మొక్కలు నాటాలన్నారు.  ఆరోగ్య కేంద్రం సిబ్బంది నియామకం కై ఉన్నతాధికారులతో చర్చిస్తా నని తెలియజేశారు.జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో వారికి కేటాయించిన టార్గెట్ కనుగుణంగా హరితహారాన్ని నిర్వహించి మొక్కలు నాటాలనీ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఎవరు కూడా విధుల పట్ల అశ్రద్ధ వహించరాదని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలను సకాలంలో అందించాలని ఎక్కడ అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏవో చందర్,ఎమ్మెల్ హెచ్ పి అఖిల్, హెచ్ ఈ ఓ నాగరాజు,సూపర్ వైజర్ మధుకర్,ఆశా కార్యకర్త పాల్గొన్నారు.