Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 5:06 pm Posted by : ramakrishna

జిల్లా బేస్ బాల్ జట్టును ప్రథమ స్థానంలో నిలపాలి

ఆర్మూర్, బతుకమ్మ :  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళల బేస్ బాల్ జట్టు‌ ఎంపికను పాఠశాల ప్రిన్సిపల్ తీగుళ్ళ నళిని ప్రారంభించినట్లు జిల్లా బెస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్మ.ధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. ప్రిన్సిపల్ నలిని క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర పోటీలలో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఈనెల 06 తేదీ వరకు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి ఈనెల 7 నుండి 9 వరకు జరిగే రాష్ట్ర బేస్ బాల్ మహిళల ఛాంపియన్ షిప్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు జోష్ణ, శ్రీలత‌ మరియు కోచ్ మౌనిక పాల్గొన్నారు.