- జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.మధుసూదన్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ జడ్పీ హెచ్ ఎస్, బాలుర పాఠశాల క్రీడామైదానంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ పురుషుల బేస్ బాల్ జట్టు ఎంపికను జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించినట్లు జిల్లా బేస్ బాల్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. మధుసూదన్ క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర పోటీలలో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13 నుండి 15 వరకు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర బేస్ బాల్ పురుషుల ఛాంపియన్ షిప్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, వ్యాయమ ఉపాధ్యాయులు కొటలా సంజీవ్ మరియు కోచ్ నరేష్ పాల్గొన్నారు.