. . . తహసీల్దార్ జి. బాలయ్య
ఇందల్వాయి, బతుకమ్మ :
మండల పరిధిలోని తిర్మన్ పల్లి, ఇందల్వాయి గ్రామాల్లో మంగళవారం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జి.బాలయ్య మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నమోదు, సవరణ ప్రక్రియలో భాగంగా ఈ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఓటరుకు ఈ ఫారాలు అందేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను రేపటి లోగా వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓలు) ఆయన ఆదేశించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల బీఎల్ఓలు, సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.