అతి త్వరలోనే ఫారాల పంపిణీ పూర్తి చేయాలి
. . . తహసీల్దార్ బాలయ్య ఇందల్వాయి, బతుకమ్మ : అధికారులు సమన్వయంతో పనిచేసి ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దార్ బాలయ్య సూచించారు. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ పారాల పంపిణీ, డిజిటల్ నమోదు ప్రక్రియను తహసీల్దార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి, తీర్మన్‌పల్లి, నల్లవెల్లి, కేకే తాండా, వెంగల్పాడు, మల్లాపూర్ గ్రామాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి చేరుకునేలా...