Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 6:36 pm Posted by : ramakrishna

అతి త్వరలోనే ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

 

. . . తహసీల్దార్ బాలయ్య

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

అధికారులు సమన్వయంతో పనిచేసి ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దార్ బాలయ్య సూచించారు. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ పారాల పంపిణీ, డిజిటల్ నమోదు ప్రక్రియను తహసీల్దార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి, తీర్మన్‌పల్లి, నల్లవెల్లి, కేకే తాండా, వెంగల్పాడు, మల్లాపూర్ గ్రామాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి చేరుకునేలా ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, డిజిటల్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత సూపర్వైజర్లు, బీఎల్‌ఓలు, స్థానిక సర్పంచులు, అంగన్‌వాడీ టీచర్లు, జీపీఓలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

 

The distribution of forms must be completed very soon.