సన్న బియ్యం పంపిణీ సాఫీగా సాగాలి

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో ఉన్న 21వ నంబర్ రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించి కోటాకు అనుగుణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాల్లోని 13,10,012 మంది...