Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 1:48 pm Posted by : ramakrishna

సన్న బియ్యం పంపిణీ సాఫీగా సాగాలి

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో ఉన్న 21వ నంబర్ రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు.

బియ్యం నాణ్యతను పరిశీలించి కోటాకు అనుగుణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాల్లోని 13,10,012 మంది సభ్యులకు ప్రతి నెలా 8248.076 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో మంగళవారం నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రాంరంభమైందని, బుధవారం మధ్యాహ్నం నాటికి 3183.095 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తయ్యిందని వివరించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, రేషన్ డీలర్ హిమబిందురేషన్ డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి, నగర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విక్కీ యాదవ్ తదితరులు ఉన్నారు.