Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 4:17 pm Posted by : ramakrishna

యువతి అదృశ్యం

బాల్కొండ, బతుకమ్మ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన పంకజ్ పటేల్ కూతురు ఇషా పటేల్ (20) అదృశ్యమైనట్లు బాల్కొండ ఎస్ఐ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..  డిగ్రీ విద్యార్థి ఈ నెల7న ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, తండ్రి పంకజ్ పటేల్ ఇచ్చిన దరఖాస్తు మేరకు ఎస్ఐ  మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా ఇట్టి అమ్మాయి ఆచూకీ గుర్తించినచో ఎస్సై బాల్కొండ సెల్ నెంబర్ 8712659860 అను నెంబర్ కి సంప్రదించగలరని తెలియజేశారు.