Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 5:31 pm Posted by : ramakrishna

వృద్ధురాలి అదృశ్యం

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామానికి చెందిన మచ్కురి ఎల్లవ్వ (76) అను ఆమె వృద్దురాలు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు గురువారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…వృద్ధురాలు కొడుకు అక్షయ్, భార్య అనిత గత రెండు సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులతో కలిసి షాపూర్ నగర్, హైదరాబాదులో ఉంటున్నారని, అప్పటి నుండి మా అమ్మ ఎల్లవ్వ ఒక్కరే చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి చిక్కడపల్లి గ్రామానికి వచ్చామని, అక్టోబర్ 14 సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్లిందని, ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో, ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోగా మా అమ్మ గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. వృద్దురాలు ఎల్లవ్వ కొడుకు అక్షయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు.