గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

  . . . ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   ఇందల్వాయి, బతుకమ్మ :   గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇందల్వాయి గ్రామ అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్) కింద మంజూరైన రూ.23 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో...