Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 6:46 pm Posted by : ramakrishna

ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గత 11రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సోమవారం ధర్మ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొత్తూరు రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గద్దల రమేష్, సంతోష్, బాగేంధర్, ప్రవీణ్ పాల్గొన్నారు.