Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 4:47 pm Posted by : ramakrishna

డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలి

  • పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి

 

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత పవనాన్ని నిర్మించాలని పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి డిమాండ్ చేశారు. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి మాట్లాడుతూ, డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. కనీస వసతులు లేకుండా విద్యార్థులకు, విద్యార్థినీలకు టాయిలెట్ సౌకర్యాలు లేకుండా కొనసాగడం సిగ్గుచేటన్నారు. కోళ్ల ఫారం లాంటి తరగతులల్లో, చెట్లు,పురుగులు పాములు తిరిగే తరగతుగదులు ఉండడం బాధాకరమన్నారు. తుప్పు పట్టిన గోడలు, ఎప్పుడు కూలిపోతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి నెలకొందన్నారు. త్రాగడానికి నీరు లేకుండా, కనీస వసతులు లేకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొనసాగడం దుర్మార్గమన్నారు. వెంటనే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు  డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో PDSU డిగ్రీ కళాశాల కమిటీ నాయకులు దీపిక,సుష్మ,మానస, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.