మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గాంధారి, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని డా.మన్మోమన్ సింగ్ మరణం బాధాకరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గాంధారీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఆయన ఒకరని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్...