రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ కి రోజులు దగ్గర పడ్డాయి
బతుకమ్మ, వేల్పూర్: రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలలలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. గత సీజన్ లో...