Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 6:33 pm Posted by : ramakrishna

ప్రజా ఉద్యమాల ద్వారా విముక్తి పొందిన రోజు

  • రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కామారెడ్డి పట్టణంలో  తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో  పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు9తూ నిజాం నిరంకుశ  రాజరిక పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన బాధలనుండి  తెలంగాణ సాయుధ పోరాటం  ఇతర ప్రజా ఉద్యమాల ద్వారా విముక్తి పొంది 17 సెప్టెంబర్ 1948లో  పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై తెలంగాణ ప్రజలు పొందిన స్వేచ్ఛ స్వాతంత్రం పొందిన రోజని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో అమలవుతున్నాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

The day of liberation through popular movements