Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 5:09 pm Posted by : ramakrishna

పొంచి ఉన్న ప్రమాదం…

  • బొప్పాపూర్ బ్రిడ్జి వద్ద అక్రమంగా మొరం త్రవ్వకాలు

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ నుండి బొప్పాపూర్ వెళ్లే దారిలో వాగు వద్ద కొంతమంది అక్రమార్కులు అక్రమంగా మొరం మట్టి త్రవ్వకాలు చేపట్టడంతో వాగులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ దారి గుండా రాకపోకలు కొనసాగించే ప్రయాణికులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఈ వాగు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రోడ్డు శిథిలమై గుంతలు పడడంతో వాహనదారులు అక్కడికి రాగానే కుదుపులకు గురై ఆ గుంతలలో పడిపోయే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా వాగులో అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

The danger lurking...