Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 1:45 pm Posted by : ramakrishna

టారిఫ్ వార్ కు తెర.. అమెరికా, చైనాల మధ్య కుదిరిన డీల్

వెబ్ న్యూస్,బతుకమ్మ : పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలను, స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసిన అమెరికా, చైనా మధ్య డీల్ కుదిరింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ లో జరిగిన వాణిజ్య చర్చల్లో పోటాపోటీగా విధించుకున్న టారిఫ్ లను తాత్కాలికంగా తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను  125 శాతం నుంచి 10 శాతానికి తగ్గంచనుంది. మరో వైపు చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను 145 శాతం నుంచి 30 శాతం తగ్గిస్తుంది. 90 రోజుల పాటు ఈటారిఫ్ లు అమల్లో ఉండేలా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.