Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 9:39 pm Posted by : ramakrishna

దోషులను పట్టుకుని ఉరి తీయాలి

 

. . . నగర రజక సంఘాల సమితి అధ్యక్షులు బగ్గలి అజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రజక కుటుంబంపై జరిగిన దాడిలో దోషులను పట్టుకొని ఉరి తీయాలని నగర రజక సంఘాల సమితి అధ్యక్షులు బగ్గలి అజయ్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రజకజన సేవా సంఘం దోబీ గల్లి పెద్ద తర్ప నుండి శివాజీ నగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామం లో మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిందని, దానికి కారణమైనటు వంటి శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, మిగతా ఆరుగురుని పట్టుకుని ఉరిశిక్ష వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర రజక సంఘలా సమితి ఉపాధ్యక్షులు మల్లెపూల గోపి, బగ్గలి కృష్ణ, రజకజన సేవా సంఘం పెద్దతర్ప అధ్యక్షులు నడిపి సాయిలు, ప్రధాన కార్యదర్శి బగ్గలి సంజీవ్, కోశాధికారి బి. సంతోష్ సుదర్శన్, సాయి పవనిజం, శ్రీకాంత్, రఘు మల్లేష్, శేషి, శారదా, మల్లెపూల సంధ్య, బగ్గలి స్వప్న, అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.