Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 6:04 pm Posted by : ramakrishna

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంటను విక్రయించాలి

 

. . . శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

బోధన్, బతుకమ్మ :

 

కొనుగోలు కేంద్రం సిబ్బందికి సహకరిస్తూ సమన్వయంతో రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని పిసిసి డెలిగేట్ గంగా శంకర్ సూచించారు. మార్క్ ఫెడ్, నా ఫెడ్ నేతృత్వంలో కల్దుర్కీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, వైస్ చైర్మన్ వసంత రెడ్డి, సొసైటీ అధికారులు ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాల్ కు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించారని, ఎకరానికి 8 క్వింటాళ్ల శనగ పంటను కొనుగోలు చేస్తున్నామని సొసైటి సీఈఓ శ్రీనివాస చారి వెల్లడించారు. ఎకరానికి 8 క్వింటాళ్ల పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్, గణపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.