’కోవర్టులు వారంతట వారే బయటపడతారు‘
అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది కవిత కేసీఆర్ కు లేఖ రాయడంపై స్పందించిన కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమి కాదన్నారు. ఈసందర్భంగా కవితకు పరోక్షంగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అన్నారు. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందన్నారు. అన్ని...