Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 2:39 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ గవర్నమెంట్ కౌంట్ డౌన్ షురూ అయింది

 

. . . తెలంగాణ ఉద్యమకారుల రక్తం చిందింది

. . . టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

 హైదరాబాద్, బతుకమ్మ:

ఉప్పల్ లో తెలంగాణ ఆడబిడ్డ ల రక్తం చిందింది. ఉద్యమకారుల రక్తం చిందింది. ఇవ్వాల్టి నుంచి ఈ ప్రభుత్వం కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం ప్రజలు, ఉద్యమకారులు ప్రతి రోజు గుర్తించాలి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఉప్పల్ భగాయత్ లో ఉద్యమకారులకు భూములు ఇవ్వాలి  భూపోరాట కార్యక్రమం జరిగింది. ఉప్పల్ లో బొడ్రాయి స్థాపన చేసి నిరసన చేపట్టిన తెలంగాణ రక్షణ సేన నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.అది అడిగినందుకు ఉద్యమకారులపై లాఠి చార్జీ చేయడం, రక్తం చిందించడం దారుణం. ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల భూమిని ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఖచ్చితంగా ప్రారంభమైందని అన్నారు..

The countdown to the end of the Congress government has begun

టిఆర్ఎస్ చీప్ కవితకు గాయాలు…

కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. ఆమెను పోలీసులు బలవంతంగా చేతులపై అమాంతం తీసుకెళ్తున్నప్పుడు జరిగిన తోపులాటలో కవితని కింద పడేశారు. అక్కడ మొత్తం పెద్ద పెద్ద బండ రాళ్ళ ఉన్నాయి. ఆ రాళ్లపై కవితకు కుదేసి నట్టుగా కింద పడేశారు. తోపులాట తాకిడికి పోలీసులు కూడా ఆమె మీద పడ్డారు. దీంతో ఆమెకు  గాయాలయ్యాయి. మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు కారు వరకు చేతులు తీసుకెళ్లిన పోలీసులు ..తోపులాటలో ఆమెకు రక్షణ లేకపోవడం తో కారు డోర్ కు ఢీ కొట్టారు. ఇక్కడ  కవితకు గాయాలయ్యాయి.

The countdown to the end of the Congress government has begun