Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 4:15 pm Posted by : ramakrishna

గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

 

నిజాంసాగర్, బతుకమ్మ : పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్  పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ  ఆధారిత ఎఫ్ ఎల్ ఎన్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఎక్స్ ఎల్ ల్యాబ్ విద్యార్థులకు  సులభంగా  మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు తమకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో పాఠశాల అభివృద్ధికి  సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టరు కిరణ్మయి  జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, మండల విద్యాశాఖ అధికారులు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్, ప్రధానోపాధ్యాయులు రామచందర్, కాల్ సింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

The cooperation of the villagers is very much needed.