కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి  పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలి

ఎంఎల్సీ అభ్యర్థి పడాల రవీందర్ కామారెడ్డి, బతుకమ్మ :  కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి  పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలని ఎంఎల్సీ అభ్యర్థి పడాల రవీందర్ అన్నారు.  సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్  చేస్తామన్న సీఎం హామీ నిలబెట్టుకోవాలపి డిమాండ్ చేశారు.  గత 15 సంవత్సరాల్లో విద్యావ్యవస్థలో కీలకంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను, ఇతర శాఖలో పని చేస్తున్న  కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్  ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని కోరినప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున...