Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 6:37 pm Posted by : ramakrishna

కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి  పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలి

ఎంఎల్సీ అభ్యర్థి పడాల రవీందర్

కామారెడ్డి, బతుకమ్మ :  కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి  పర్మినెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలని ఎంఎల్సీ అభ్యర్థి పడాల రవీందర్ అన్నారు.  సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్  చేస్తామన్న సీఎం హామీ నిలబెట్టుకోవాలపి డిమాండ్ చేశారు.  గత 15 సంవత్సరాల్లో విద్యావ్యవస్థలో కీలకంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను, ఇతర శాఖలో పని చేస్తున్న  కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్  ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని కోరినప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేనున్నానని పడాల రవీందర్ పేర్కొన్నారు.  ప్రతి జిల్లా పర్యటన కార్యక్రమంలో  చైతన్యవంత కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ లో ఓటు నమోదు తక్కువగా ఉండటం చాలా ఆలోచించదగ్గ విషయం  అని తెలిపారు. యువత, గ్రాడ్యుయేట్ లు తక్షణమే ఎంఎస్సీ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.  ప్రజా స్వామ్యం పరిరక్షణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు,గ్రాడ్యుయేట్ లకు న్యాయం,కాంట్రాక్టు, ఔటసోర్సింగ్  ఉద్యోగుల, భద్రత, గ్రాడ్యుయేట్  యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, సభ్యండా కుటుంబ సభ్యులందరికీ  సంక్షేమ ఫలాలు పొందుటకై మనం మన వానిని ఓటు నమోదు గా వినియోగించు కోవాలి అని సూచించారు. మనం మన ప్రశ్నించే గొంతుక కి ఓటు వేద్దాం అంటూ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు రాములు,చిరంజీవి, లింగం, శ్రీనివాస, శైలజ  మాధవి,భక్తమాల,మాధవి సాయిరెడ్డి, కవిత,శంకర్, కామారెడ్డి యూఆర్ఎస్, కేజీబీవీ ఎస్వోలు పాల్గొన్నారు.