Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 1:26 pm Posted by : ramakrishna

బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ

నిజామాబాద్, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం ను సుదర్శన్ రెడ్డి నాశనం చేశాడన్నారు. జిల్లా కేంద్రంలో స్టేడియం లేకుండాపోయిందని అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే బోధన్ లో నవోదయ పెట్టాలని సుదర్శన్ అంటున్నాడన్నారు. కాంగ్రెస్ కు స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు గెలిచే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 85శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీకెట్ల కోసం నన్ను తిడుతున్నారు. మీకు టికెట్ లు వచ్చినా గెలిచే పరిస్థితి లేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ పార్టీ టికెట్లకు తీవ్ర పోటీ ఉందని అర్వింద్ పేర్కొన్నారు.