Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:06 pm Posted by : ramakrishna

హల్ చల్ సృష్టించిన కంటైనర్ లారీ….

 

. . . 44 జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ పైకి అతివేగంగా దూసుకెళ్లిన వైనం

 

. . . భారీగా ట్రాఫిక్ జాం

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

44వ జాతీయ రహదారిపై కంటైనర్ లారీ ఐచర్ సృష్టించిన ఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ వైపు నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న పెద్ద కంటైనర్ లారీ అతివేగంగా సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామం వద్ద ఉన్న 44 జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ పైకి సూచన బోర్డులను, గద్దెలను గుద్దుకుంటూ ఎక్కింది. దీంతో ఈ ప్రమాద సమయంలో పెద్ద శబ్దంతో డివైడర్ గద్దెలు రోడ్డుపైన పడటంతో అటువైపు వెళుతున్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈ మేరకు చేరుకున్న జిఎంఆర్ హైవే పెట్రోలింగ్ భిక్కనూరు పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.

 

The container lorry that created the buzz....